పొంగల్(సంక్రాంతి) పండుగ సందర్భంగా తమిళనాడులోని పేదలకు ప్రత్యేక కానుకలు అందించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. ఇందుకోసం రూ.2363.13 కోట్లు కేటాయించింది.
రేషన్ కార్డు ఉన్న కుటుంబం రూ. 1000/- తో పాటు.. పాయసం సామగ్రి, మహిళలకు చేనేత చీరలు, పురుషులకు చేనేత పంచెలు కానుకగా అందించనున్నారు.
పండుగ రోజు నోరు తీపి చేసుకునేందుకు పొంగల్ తయారీకి కావల్సిన సామగ్రిని రేషన్ దుకాణంలో ఉచితంగా పంచనున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌లో ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, 20 గ్రాముల జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 5 గ్రాముల యాలకులు ఉంటాయి. శుభసూచకంగా భావించే 2 అడుగుల పచ్చని చెరకు గడను కూడా ఇందులో అందించనున్నారు.
ఇదీ చదవండి:గాడ్సే వ్యాఖ్యలపై సాధ్వీ క్షమాపణలు- విపక్షాలతో స్పీకర్ భేటీ