ప్లాస్టిక్ భూతం కారణంగా పర్యావరణానికి ప్రమాదమని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ఆలోచన చేశారు ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా అధికారులు. ఇందులో భాగంగా సెక్టార్-94లోని మహామాయా పైవంతెన వద్ద 1300 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో భారీ రాట్నాన్ని రూపొందించారు.
14 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ రాట్నం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుందని నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరీ తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కలిగించడమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు..
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ రాట్నాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. ఎంతో ఆకర్షణగా ఉన్న ఈ రాట్నం చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి : 'న్యూఇయర్ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్ ధరల పెంపు'