కేరళ కొట్టాయం సమీపంలో మలరికాల్ గ్రామంలో అంబాల్ ఆలయం చెరువు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొట్టాయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు విరబూసిన కలువపూలతో కళకళలాడుతోంది.
కలువ పూలతో నిండిపోయిన చెరువు గులాబీవర్ణ శోభితంగా మెరిసిపోతోంది. ఈ దృశ్యం ఐరోపాలోని తులిప్ పుష్పాలను గుర్తుకు తెస్తున్నాయి.
600 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువును సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు తరలివస్తున్నారు. అయితే పర్యటకులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి: అమెరికాకు రెండోసారీ చిక్కని విక్రమ్