ఆవు శాకాహారి. కామధేనువు పచ్చని గడ్డి ఆరగిస్తుందని అని అందరికీ తెలుసు. కానీ గోవాలో మాత్రం మాంసాన్ని భుజిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా గోవా మంత్రి మైఖేల్ లోబో తెలిపారు.
కాలన్ఘాట్, కాండోలిమ్లో రోడ్డు మీద తిరిగే ఆవులు ఆకలికి తట్టుకొలేక చెత్తలో వేసిన చేపలు, కోడి మాంసం వ్యర్థాలను తినడం ద్వారా మాంసాహారిగా మారినట్లు వివరించారు లోబో.
గోశాల నిర్వహకులు కాలన్ఘాట్ నుంచి 76 ఆవులను తీసుకువచ్చారు. ఈ ఆవులు గడ్డి, దాణా తినకుండా మాంసాన్ని భుజిస్తున్నట్లు నిర్వహకులు గమనించారు.
ఆవులు శాకాహారులు అని మనకు తెలుసు. కానీ కాలన్ఘాట్ ఆవులు మాత్రం మాంసాహారులు. గోశాల నిర్వహకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆవులను స్థానిక పశువుల వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
- మైఖేల్ లోబో, గోవా మంత్రి.