తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సుజిత్ మృతి చెందాడు. మూడు రోజులుగా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగించిన అధికారులు.. సుజిత్ మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిమిత్తం భౌతికకాయాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం... అశ్రునయనాల మధ్య సుజిత్‌కు తుది వీడ్కోలు పలికారు.
ఈ నెల 25న సుజిత్ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోగా దానికి సమాంతరంగా 60 అడుగులకు పైగా లోతు బావిని తవ్వారు. ఈ తరుణంలో పెద్ద బండరాళ్లు, వర్షం అడ్డుగా వచ్చాయి. ఈ ఆటంకాలన్నీ అధిగమించి బాలుడుని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసిన సహాయసిబ్బంది.. చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. సుజిత్ ప్రాణాలతో బోరుబావి నుంచి బయటపడాలంటూ ప్రధాని మోదీ సహా సామాన్య ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆ బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ఇదీ చూడండి : సుజిత్ కోసం ప్రార్థనలు.... నిర్విరామంగా సహాయక చర్యలు