ETV Bharat / bharat

'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ: సుప్రీం

'శబరిమల వ్యవహారం విస్తృత ధర్మాసనానికి బదిలీ'
author img

By

Published : Nov 14, 2019, 10:15 AM IST

Updated : Nov 14, 2019, 12:05 PM IST

12:04 November 14

'శబరిమల'వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ

శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సమీక్ష పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయన్న న్యాయస్థానం, మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని.. పిటిషనర్లు కోరినట్లు పేర్కొంది. ఒకేమతంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు వారికి నచ్చిన విధానాలు ఆచరించే స్వేచ్ఛ ఉందన్న కోర్టు.. మత విధానాలనేవి నైతికత, ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండరాదని అభిప్రాయపడింది. 

"మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశంపైనా చర్చ జరిగింది. కీలకమైన మత విధానాలను మతపెద్దలతో చర్చించాలా? అనే విషయం నిర్ధరించాలి. మత విశ్వాసాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అనే అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలించాలి." 
- తీర్పులో సుప్రీంకోర్టు

రెండు రోజుల్లో తెరుచుకోనున్న ఆలయం

మండల పూజ కోసం మరో రెండు రోజుల్లో ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న వేళ..  గత తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాటి తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన 65 పిటిషన్లు పెండింగ్ ఉంచింది. 

3:2 మెజారిటీతో తీర్పు

పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న తీర్పును 3:2 మెజారిటీతో వెల్లడించింది కోర్టు. ఈ నిర్ణయాన్ని జస్టిస్ రంజన్​ గొగొయి, జస్టిస్ జె ఖన్వీల్కర్, జస్టిస్ ఇందూమల్హోత్రాలు సమర్థించగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకించారు. 

సుప్రీంకోర్టు గత తీర్పులో ఏముంది?

కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ తరఫున ఆరుగురు మహిళలు 2006లో సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. మహిళల ప్రవేశానికి అనుమతించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు. 

సుప్రీంకోర్టు తీర్పుపై మొదట తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు... తర్వాత మెత్తబడ్డారు. సనాతన సంప్రదాయాలను గౌరవించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గట్టిగా వాదించిన, ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సైతం ఆ తర్వాత తీర్పును గౌరవిస్తామంటూ ప్రకటించింది. అయితే.... వేలమంది అయ్యప్ప భక్తులు మాత్రం మహిళల ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ కేరళతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు
 
10:44 November 14

'శబరిమల వ్యవహారం విస్తృత ధర్మాసనానికి బదిలీ'

  • శబరిమల వ్యవహారం విస్తృత ధర్మాసనానికి బదిలీ: సుప్రీంకోర్టు
  • విస్తృత ధర్మాసనానికి బదిలీచేయాలని మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయం
  • ఏడుగురు సభ్యుల బెంచ్‌ ముందుకు వెళ్లనున్న శబరిమల కేసు
  • సమీక్ష పిటిషన్లన్నీ పెండింగ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు
  • మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశం కూడా చర్చకు వచ్చింది: సీజేఐ
  • కీలకమైన మత విధానాలను మతపెద్దలతో చర్చించాలా అనే విషయం నిర్ధారించాలి: సీజేఐ
  • శబరిమల వ్యవహారాన్ని విస్తృత బెంచ్‌కు నివేదించాలని మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయం
     
10:35 November 14

లైవ్​: శబరిమలకు మహిళల అనుమతిపై సుప్రీం తీర్పు

  • సమీక్ష పిటిషన్‌తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి: సీజేఐ
  • మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారు: సీజేఐ
  • ఒకే మతంలో ఉన్న వివిధ వర్గాలు వారికి నచ్చిన విధానాలు ఆచరించే స్వేచ్ఛ ఉంది: సీజేఐ
  • మత విధానాలనేవి నైతికత, ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండరాదు: సీజేఐ
  • మతంలోకి చొచ్చుకునే అధికారం కోర్టులకు ఉందా అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది: సీజేఐ

10:03 November 14

శబరిమలపై మరికొద్ది క్షణాల్లో తుది తీర్పు

శబరిమలకు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాటి తీర్పుపై పునస్సమీక్ష కోరుతూ దాఖలైన 64 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మరికొద్ది క్షణాల్లో తుది తీర్పు ఇవ్వనుంది.

వివాదం ఎందుకు?

హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని.. అందువల్ల ఆయన ఆలయంలోకి రుతు క్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని.. శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్తమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ- ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై వివాదం మొదలైంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది.

నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

సుప్రీంకోర్టు తీర్పుపై మొదట తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు... తర్వాత మెత్తబడ్డారు. సనాతన సంప్రదాయాలను గౌరవించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గట్టిగా వాదించిన, ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సైతం ఆ తర్వాత తీర్పును గౌరవిస్తామంటూ ప్రకటించింది. అయితే.... వేలమంది అయ్యప్ప భక్తులు మాత్రం మహిళల ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ కేరళతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.

మణికంఠుడి ఆలయం.. ఎందుకంత ప్రసిద్ధి?

కేరళలోని పతనంథిట్ట జిల్లాలో.. పశ్చిమ కనుమల్లోని శబరిమల శిఖరంపై ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం కొలువై ఉంది. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో, పెరియార్‌ పులుల అభయారణ్యంలో 18 గుట్టల మధ్య ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అంటే ‘వృద్ధి’ అని అర్థం. ఈ ఆలయానికి ఏటా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ గుడిని నవంబరు-డిసెంబరులో మండల పూజలకు, జనవరి 14న మకర సంక్రాంతికి, ఏప్రిల్‌ 14న విషువ పండుగకు, మలయాళ నెలల్లోని ప్రతి మొదటి అయిదు రోజుల సమయంలో భక్తులకు పూజలు చేసుకోవడానికి తెరుస్తారు.

AP Video Delivery Log - 0000 GMT News
Thursday, 14 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2357: Mexico Morales Award AP Clients Only 4239802
Morales given award in Mexico City
AP-APTN-2352: US KY Governor Race AP Clients Only 4239801
Governor Bevin faces big decision in recanvass
AP-APTN-2352: US MO Unicorn Puppy Must Credit MacsMission.org 4239800
Rescued puppy has an extra tail on forehead
AP-APTN-2350: US CA Impeachment Hearing Reaction More AP Clients Only 4239799
Impeachment hearing generates mixed reaction
AP-APTN-2342: Gaza Explosion 2 AP Clients Only 4239798
Explosion in Gaza, rockets fired towards Israel
AP-APTN-2332: Lebanon Protest Coffin AP Clients Only 4239797
Lebanese mourn man shot dead in protests
AP-APTN-2321: Italy Venice Conte AP Clients Only 4239796
Italy's PM visits Venice after devastating floods
AP-APTN-2317: US Trump Erdogan Impeachment Kurds AP Clients Only 4239795
With Erdogan, Trump talks impeachment, Kurds
AP-APTN-2300: Brazil Putin Xi AP Clients Only 4239794
Putin, Xi meet on sidelines of Brasilia summit
AP-APTN-2252: AIR US Esper Korea AP Clients Only 4239793
Esper: US could alter military drills for NKorea
AP-APTN-2251: Brazil Venezuela Charge d'Affairs AP Clients Only 4239792
Situation over at Venezuela embassy in Brazil
AP-APTN-2237: US Trump Erdogan Briefing AP Clients Only 4239791
Turkey’s Russian air defense system irks Trump
AP-APTN-2235: US Impeach Reactions AP Clients Only 4239790
Dems, GOP joust after first impeachment hearing
AP-APTN-2231: ARCHIVE Guy Laliberte AP Clients Only 4239789
Cirque du Soleil founder held in marijuana case
AP-APTN-2216: Slovakia Bus Crash 4 AP Clients Only 4239787
Slovakian PM visits site of bus crash
AP-APTN-2213: US Trump Senators Turkey AP Clients Only 4239786
Turkey’s president aims to resettle war refugees
AP-APTN-2208: US Impeach Hearing Highlights AP Clients Only 4239785
First public hearings in Trump impeachment inquiry
AP-APTN-2204: UK Corbyn McDonnell AP Clients Only 4239784
Top UK Labour figures make election pitches
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 14, 2019, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.