ఎన్నికల చివరి అంకంలో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. బంగాల్ మధురాపుర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి భయంతో దీదీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
"దీదీ.. బంగాల్ను తన జాగీరుగా భావిస్తున్నారు. టీఎంసీ గూండాలు బీభత్సం సృష్టించారు. రాత్రివేళ గొప్ప సామాజికవేత్త ఈశ్వర్ చంద్ విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ కళాశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ విధంగానైతే శారద, నారద కుంభకోణాల్లో సాక్ష్యాలు మాయం చేశారో.... ఇప్పుడూ అదే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి భయంతో దీదీ వణికిపోతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రోజు ఉదయం... నన్ను జైలుకు పంపిస్తానని బెదిరించారు. నిన్న మీడియాలో చూశా భాజపా కార్యాలయాన్నే కబ్జా చేస్తానని దీదీ బెదిరిస్తున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి 'బంగాల్లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'