అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీరామ నవమి రోజున శంకుస్థాపన చేయాలని యోగా గురువు బాబా రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలయం వేద సంప్రదాయానికి అద్దంపట్టేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
"అయోధ్యలోని రామాలయం హిందువుల గొప్ప తీర్థయాత్ర స్థలంగా అభివృద్ధి చెందాలి. వాటికన్ సిటీ, మక్కా, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలా మహోత్కృష్టంగా ఎదగాలి." - బాబా రామ్‌దేవ్, యోగా గురువు
కర్ణాటకలోని ఉడిపిలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాబా రామ్‌దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అయోధ్య రామాలయం గొప్ప వేద సంప్రదాయాలను ప్రతిబింబించాలి. రామజన్మ భూమి ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య ... ఆధ్యాత్మిక జ్ఞానబోధనకు కేంద్రంగా నిలవాలి."- బాబా రామ్‌దేవ్, యోగా గురువు
ఇదీ చూడండి: 'పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి'