ఒడిశా రాయ్‌గఢ్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. నియామ్‌గిరి ప్రాంతంలో రహదారి నిర్మాణం కోసం తీసుకువచ్చిన రెండు జేసీబీ యంత్రాలు, ఒక రోలర్, కాంక్రీట్ మిక్సర్‌ను తగలబెట్టారు. నక్సల్స్ దుశ్చర్యలను అడ్డుకోవడానికి కార్మికులు ప్రయత్నించగా... వారిని చితకబాదారు.
రహదారి నిర్మాణాన్ని ఆపాలని అధికారులను బెదిరిస్తూ మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు... ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇదీ చూడండి: అమ్మభాషకు ఆలంబన.. విశిష్ట అధ్యయన కేంద్రం ఆరంభం