ETV Bharat / bharat

మోదీ సర్కార్​ బుల్లెట్​ రైలుకు ఠాక్రే బ్రేకులు! - తాజా వార్తలు మహారాష్ట్ర రాజకీయాలు

మోదీ సర్కార్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముంబయి-అహ్మదాబాద్​ బుల్లెట్​ రైలు ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల 29న మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్​ ఠాక్రే.... బుల్లెట్​ రైలు సహా మహారాష్ట్రలో జరుగుతోన్న అన్ని ప్రాజెక్టులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

Maha govt to review bullet train project: Thackeray
మోదీ సర్కార్​ బుల్లెట్​ రైలుకు.. ఠాక్రే బ్రేకులు!
author img

By

Published : Dec 2, 2019, 11:32 AM IST

Updated : Dec 2, 2019, 3:31 PM IST

మోదీ సర్కార్​ బుల్లెట్​ రైలుకు ఠాక్రే బ్రేకులు!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్​ ఠాక్రే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మోదీ సర్కార్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముంబయి-అహ్మదాబాద్​ బుల్లెట్​ రైలు ప్రాజెక్ట్​కు బ్రేకులు వేశారు. బుల్లెట్​ రైలు సహా గత ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్ట్​లను సమీక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.

ప్రాజెక్ట్​ కోసం పెద్దఎత్తున భూ సేకరణ చేయాల్సి ఉండటం వల్ల.. బుల్లెట్​ రైలు ప్రాజెక్టుపై రైతులు, గిరిజనుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మెట్రో రైలు షెడ్​ నిర్మాణం కోసం... ముంబయి శివారులోని గోరేగావ్ ఆరే ప్రాంతంలో వేలాది చెట్ల నరికివేతపై పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వటం వల్ల గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పట్టించుకోలేదు.

అయితే ఇటీవల సీఎం పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్​ ఠాక్రే మెట్రో రైలు షెడ్​ నిర్మాణం ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. బుల్లెట్​ రైలు ప్రాజెక్టుపైనా సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు శివసేన వర్గాలు పేర్కొన్నాయి.

Mumbai, Dec 02 (ANI): Bollywood actors Chunky Panday, Sunny Leone reached at photographer Dabboo Ratnani's residence to pay their condolences in Mumbai. His mother Prabha Ratnani breathed her last on Nov 28. Several others B-town celebrities also paid their condolences.

Last Updated : Dec 2, 2019, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.