కర్ణాటక ఉపఎన్నికల్లో ఒక కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. చిక్‌బళ్లాపుర్ పోలింగ్ కేంద్రంలో 'సెంచరీ ఓట్ల'తో రికార్డు సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 110 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ కుటుంబంలో సందడి నెలకొంటుందన్నారు ఉమ్మడికుటుంబ సభ్యుడు లక్ష్మీరామ్. అందరూ ఒకే కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్‌కు గైర్హాజరు కామని, దీని ద్వారా ఓటు ప్రాధాన్యాన్ని చాటుతున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: కర్ణాటక: కొనసాగుతున్న పోలింగ్- బారులు తీరిన ఓటర్లు