ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీకి చెందిన ఓ జవాను తన సహచరులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్ సహాయంతో రాయ్‌పుర్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.
ఘటనాస్థలంలో.. కాల్పులు జరిపిన జవాను మృతదేహం కూడా లభించింది. అతడిని మసూదుల్ రహ్మాన్‌గా గుర్తించారు. అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇతర సైనికులే అతడిని కాల్చిచంపారా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే... సహచరులపై దాడి అనంతరం రహ్మాన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు.
రహ్మాన్ ప్రవర్తనకు గల కారణాలు ఇంకా తెలియలేదు.
ఈ ఘోరం ఇండో-టిబెటిన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) 45వ బెటాలియన్ ఉంటున్న కేదానర్ గ్రామంలో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు జరిగింది.
రహ్మాన్ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు... హెడ్ కానిస్టేబుల్- మహేంద్ర సింగ్, దల్జిత్ సింగ్, కానిస్టేబుల్- సుర్జిత్ సర్కార్, బిస్వరూప్ మహతో, బిజేశ్.
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.