పౌరసత్వ చట్ట సవరణ బిల్లు వివక్షాపూరితమని ఆరోపించారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్. ఈమేరకు కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
దేశంలో ఒక వర్గం ప్రజలు మాత్రమే నివసించేలా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నమే ఈ బిల్లు. ఇది వివక్షాపూరితం.
రాజ్యాంగంలో ఉన్న తప్పులను సరిదిద్దటం మన బాధ్యత. కానీ మంచి విషయాలను సరిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ద్రోహం చేయటం లాంటిది.
కేంద్రం ఈ బిల్లు తీసుకురావడం... ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శస్త్రచికిత్స చేసేందుకు ప్రయత్నించడానికి సమానం.
-కమల్ హాసన్, ఎంఎన్ఎం అధినేత
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను యువ భారతం వ్యతిరేకిస్తుందని కమల్ అన్నారు.
ఇదీ చూడండి:సంయుక్త కమిటీ ముందుకు సమాచార గోప్యత బిల్లు!