కర్ణాటక చిక్ మంగళూరు జిల్లాలోని కొప్పా నగరంలో ఓ మేక.. తన యజమాని అంతిమయాత్రలో పాల్గొని విశ్వాసాన్ని చాటుకుంది. హుసేనబ్బ అనే మత్స్యకారుడు చాలా ఏళ్ల నుంచి ఓ మేకను పెంచుతున్నారు. ఆయన శుక్రవారం గుండెపోటుతో మరణించారు.
ఇన్నాళ్లూ తనను పెంచిన యజమాని అకస్మాత్తుగా మరణించడం వల్ల ఆ మూగజీవం తల్లడిల్లింది. యజమాని అంతిమయాత్రలో కడదాకా పాల్గొని వీడ్కోలు పలికింది.
- ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!