మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను తొలగించే విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలుగజేసుకోవాలని రైతు ఉద్యమనేత కిశోర్ తివారీ అభ్యర్థించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర సమస్య పరిష్కారానికి వినియోగించాలని భగవత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
"మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆర్ఎస్ఎస్ మౌనంగా ఉండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడ్కరీ అయితే ఈ సమస్యను కేవలం 2 గంటల్లోనే పరిష్కరించగలుగుతారు." - కిశోర్ తివారీ, శివసేన నేత
ఎన్నికలకు ముందు శివసేనలో
కిశోర్ తివారీ విదర్భ జన్ అందోళన్ సమితిని స్థాపించారు. మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భలో రైతు ఆత్మహత్య నివారణకు కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా నుంచి శివసేనలోకి వెళ్లారు.
ముఖ్యమంత్రి పీఠం కోసం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమి మెజారిటీ సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. చెరోసగం పాలన చేపట్టాలని శివసేన కోరుతుండగా, ఫడణవీస్ మాత్రమే సీఎం అవుతారని భాజపా అంటోంది. ఫలితంగా ఎన్నికల ఫలితాలు వెలువడి 11 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పడలేదు.
ఇదీ చూడండి: ఆదర్శం: అప్పు ఇవ్వలేదని బ్యాంకే పెట్టేసింది