మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ వద్దకు విడివిడిగా వెళ్లారు ఆ పార్టీల నేతలు. భాజపా నుంచి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన సేన దివాకర్ రావోటే రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే కలవనున్నట్లు తెలిపారు ఇద్దరు నేతలు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటు, రాజకీయాలపై చర్చలేమీ ఉండవని స్పష్టం చేశారు.
తాజా ఎన్నికల్లో భాజపాకు మెజారిటీ తగ్గిన కారణంగా ఇద్దరు సీఎంల ప్రతిపాదన తీసుకొచ్చింది శివసేన. దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో 105 మందితో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గతం కన్నా 17 సీట్లు తక్కువ సాధించింది.