ETV Bharat / bharat

కార్పొరేట్ సామాజిక బాధ్యత మరచిన పెద్దలు - eenadu editorial

బడ్జెట్​లో నిధులు సరిపోక బడుల్లో శౌచాలయాలు కట్టించడానికి సీఎస్​ఆర్​(కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధులను సమీకరిస్తారట అధికారులు. ప్రభుత్వానికి ఉండే బాధ్యతల్లో ఇదీ భాగమేనా? ప్రతీ పనికి బడ్జెట్ కేటాయించలేక నిధులు సీఎస్​ఆర్​ సమీకరణ చేయడం సబబేనా. మరి పౌరుల సామాజిక బాధ్యత మాటేంటి అన్నది కార్పొరేట్ల ప్రశ్న. అన్నీ ప్రభుత్వాలే ఎందుకు చేయాలి? చందాలు పోగు చేసి కట్టించుకోలేరా? అన్నది వారి భావన. రాజకీయ నాయకులకైతే ఉమ్మడి సామాజిక బాధ్యత ఉండనే ఉంది కదా!

కార్పొరేట్ సామాజిక బాధ్యత మరచిన పెద్దలు
author img

By

Published : Nov 19, 2019, 7:52 AM IST

ఇది విన్నావా అన్నా! చాలా సర్కారీ బడుల్లో పిల్లలు 'ఒకటికి' బయటికే వెళ్లాల్సి వస్తోందిట. శౌచాలయాలు కట్టిద్దామంటే బడ్జెట్లో విద్యాశాఖకు నిధులు విదల్చలేదట ప్రభుత్వం. హవ్వ... ఎంత సిగ్గు చేటు? వాటిని కట్టించడానికి సీఎస్సార్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత - కా.సా.బా.) నిధులను సమీకరిస్తారట అధికారులు'

'అవున్రా... తప్పేముంది అందులో? ప్రతి పనికీ బడ్జెట్లో నిధుల్ని కేటాయించలేరు కదా! అందుకే సీఎస్సార్‌ నిధుల్ని సమీకరిస్తామని అధికారులు అన్నారేమో! పాపమని పచ్చిపులుసు పోస్తే, నేతిబొట్టు లేదని లేసి లేసి ఉరికిండట నీలాంటివాడు. అలాగుంది నీ వాటం'

'అదేంటన్నా అలాగంటావ్‌! ప్రభుత్వానికి బాధ్యత ఉండదా?'

'ఎందుకుండదూ? ఉండబట్టే కదా ఇన్నేసి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సంక్షేమ పథకాలు వగైరాలు సమకూరుతున్నాయి. వీటికే నిధులు సరిపోవడంలేదు. అంచేత విద్య, వైద్యం, శౌచం వగైరాలన్నింటికీ సీఎస్సార్‌ కింద నిధులు వసూలు చేయాల్సిందే! అదేదో సినిమాలో చెప్పినట్లు, సంపాదనలో ఎంతోకొంత తిరిగిచ్చేయాలి... లేకపోతే లావెక్కిపోతారు. ఇదేమరి సీఎస్సార్‌ అంటే!'

ఎన్ని స్కీములుంటే అన్ని స్కాములు

'అంతేలే అన్నా, బడ్జెట్లో ఎన్ని స్కీములుంటే అన్ని స్కాములకు అవకాశం. ఉత్తరోత్తరా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరికీ అనుమానం రాకుండా, కేసులు మన మెడకు చుట్టుకోకుండా, ఇంజినీరింగ్‌ శాఖలో మాదిరిగా అధీకృత ఖర్చుల విలువలోనే ఆమ్యామ్యానూ జోడిస్తే- ఇక తిరుగుండదు'

పౌరులకు సామాజిక బాధ్యత ఉండదా?

'హ్హ...హ్హ... నీక్కూడా విషయం బాగానే వివరమైంది. నీకు చెప్పడం బహు తేలిక. అయినా, నాకు తెలీక అడుగుతా... పౌరులకు సీఎస్సార్‌... అదే, పౌరుల సామాజిక బాధ్యత పౌ.సా.భా. ఉండదా? మీ పిల్లలు చదువుకునే పాఠశాలల్లో శౌచాలయాలు లేకపోతే మీరందరూ ఏం చేస్తున్నట్టు? చందాలు వసూలు చేసో, శ్రమదానానికి దిగో కట్టించుకోలేరా? ఆ మాత్రం పౌ.సా.బా. మీకు లేదా అని క్రొశ్నిస్తున్నాను'

'అంతేలే అన్నా... కరెక్టుగా చెప్పావు. వాటిని ప్రభుత్వమే ఊరూరా ఏర్పాటు చేయడానికి అవేమైనా నిత్యకల్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయే బెల్టు షాపులా ఏంటి?'

'అదేరా నేననేది కూడా. అటువంటి పౌ.సా.బా. జనానికి లేకపోబట్టే మహారాష్ట్రలో ఈవేళ ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా బాధ్యతే ఉంటే, అంతటి గ్రహింపే ఉంటే, ఇలా 'కిచిడీ'లా ఎందుకవుతుందీ?

మరి రాజకీయ నాయకులకు?

'అదేంటన్నా, అంతమాటనేశావ్‌? పౌరులకు, సంస్థలకేనా సీఎస్సార్‌? రాజకీయ పార్టీలకు, నాయకులకు ఉండదా?'

'ఓహ్‌... లేకేం భేషుగ్గా ఉంది. కామన్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ. ఉమ్మడి సామాజిక బాధ్యత అని అంటారు వాళ్ళ సీఎస్సార్‌ని. హరియాణాలో చూడు- వాటికున్న ఉ.సా.భా.ను గుర్తుచేసుకుని, జేజేపీ, బీజేపీ కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఏదో ఒకరకంగా ప్రభుత్వాల్ని ఏర్పాటుచేసి అధికారాల్ని అందుకోవడం, పంచుకోవడం, పెంచుకోవడమే పార్టీలకు, నాయకులకు ఉండే సీఎస్సార్‌ అంటే'

'అవునవును. అంతేలే అన్నా. మాధవబొట్లకు ఏటా రెండుమార్లు పడిశం రావడమూ, వచ్చినప్పుడల్లా అది ఆరేసి నెల్లు ఉండటమూ మామూలేనన్నట్లు... అయిదేళ్లకొకసారి ఎన్నికలు రావడమూ- ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చినా, మీకున్న ఉ.సా.బా. ప్రకారం దాన్ని మీకనుకూలంగా చేసుకుని పదవులు పంచుకోవడమూ మామూలే కదా!'

'అవున్రా. ఎన్నికలంటే ఆషామాషీ కాదు. ఎన్నో వేలకోట్లు గుమ్మరిస్తేకానీ ఒక ఎలక్షన్‌ పూర్తికావడం లేదు. అంతలేసి ఖర్చు చేశాక కూడా ఓటర్లు తమ పౌ.సా.బా.ను మరచిపోయి కలగూరగంపలను వడ్డిస్తే మా గతేంకానూ? అందుకనే మేము మా ఉ.సా.బా.తో అధికారాల్ని పంచుకుంటాం'

చూసేవాళ్లు ఉండబట్టే సినిమాలు...

'కరెక్టే అన్నా... నా అమాయకత్వం కానీ, తేనెపోసి పెంచినా వేపకు చేదు పోదన్నట్టు- మీ పార్టీలకు, నాయకులకు బుద్ధిమారదు ఏం చేసినా!'

'అలా అకారణంగా మమ్మల్ని ఆడిపోసుకోకురా...'

'సకారణమే అన్నా... సినిమాలు, వాటిలో దృశ్యాలు చెత్తగా ఉంటున్నాయని అంటే, వాటిని చూసేవాళ్లుండబట్టే అలా తీస్తున్నారంటారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ని వాడకండని అనే బదులుగా, వాటి తయారీనే రద్దు చేయచ్చుగా! ఆ పని మాత్రం చేయరు'

'తయారీని ఆపమంటే- ఆ పరిశ్రమ, అందులోని కార్మికులు రోడ్డున పడరూ? అంచేత ముందో పని జరిగితే ఆనక సీఎస్సార్‌ కింద నిధులడిగి వాళ్లనే తప్పుల్ని సరిచేయవచ్చు'

'అంటే...?'

మద్యం లాభాలతోనే నిషేధ ప్రచారం

'అర్థం కాలేదా? మద్యం విపరీతంగా అమ్ముడై, ఇబ్బడిముబ్బడిగా లాభాలొచ్చాక, ఆ నిధులతోనే మద్యపాన నిషేధ ప్రచారాన్ని ఆర్భాటంగా చేయొచ్చు. ప్లాస్టిక్‌ పరిశ్రమకు విపరీతంగా లాభాలొచ్చాక, ప్లాస్టిక్‌ వినియోగిస్తే వచ్చే నష్టాల్ని ఆ డబ్బులతోనే ఏకరువుపెట్టచ్చు. అలాగన్నమాట!'

'ఇప్పుడు అర్థమైందన్నా. తలగొరిగించుకున్నాక తిథి, వార, నక్షత్రాలు చూసినట్లన్నమాట. అద్సరే... మరి సీఎస్సార్‌ కింద ఏం చేస్తారన్నా మీరు?'

'అద్గదీ... ఇప్పుడు అసలు విషయానికొచ్చావు. స్విస్‌ బ్యాంకుల్లో దాచినా, తీసుకోవడం కుదరకపోతే ఒకతరం గడిచేసరికి ఆ డబ్బుకు కాలదోషం పడుతోంది. వాడే మింగేస్తున్నాడు. అదే ఎన్నికల్లో ఖర్చు పెడితేనో... తరతరాలకూ పనికొస్తుంది, మా సీఎస్సార్‌ను నెరవేర్చినట్లూ ఉంటుంది, దండిగా ఓట్లూ రాలతాయి ఉభయతారకంగా! అంచేతొరే... ఎంతసేపూ మమ్మల్నాడిపోసుకోకుండా, నువ్వు చేసే పనేదైనా సరే, నీ సీఎస్సార్‌ని దృష్టిలో ఉంచుకుని చెయ్యి. సమాజం బాగుపడుతుంది'

'సరే అన్నా... నువ్వన్నాక తప్పుతుందా? అదే పనిలో ఉంటా!'

AP Video Delivery Log - 1700 GMT News
Sunday, 17 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1659: UK Prince Andrew Interview Reax Swinson AP Clients Only 4240378
Lib Dem leader on Prince Andrew, immigration
AP-APTN-1648: Czech Republic March AP Clients Only 4240375
Thousands mark 30th anniversary of Velvet Revolution
AP-APTN-1643: Sri Lanka President Elect AP Clients Only 4240374
Rajapaks elelected Sri Lankan President, vow to serve all
AP-APTN-1633: Hong Kong University 2 AP Clients Only 4240372
Police try to evacuate protesters from Polytechnic
AP-APTN-1622: Italy Venice Flooding 2 AP Clients Only 4240358
Tourists and business owners cope with exceptional tide
AP-APTN-1619: UK Prince Andrew Interview Reax No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4240368
Royal historian: Prince Andrew's BBC i/v "PR disaster"
AP-APTN-1601: Iraq Protests 2 AP Clients Only 4240366
Iraq protesters build barriers on a Baghdad bridge
AP-APTN-1532: Vatican Pope Poor AP Clients Only 4240364
Pope provides lunch for 1500 poor people at Vatican
AP-APTN-1532: Taiwan Election AP Clients Only 4240363
Tsai Ing-wen on US-China trade war and Hong Kong
AP-APTN-1503: UAE Airshow AP Clients Only 4240361
Dubai Airshow opens, no major deals amid airline cutbacks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.