పౌర చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎమ్ఐ) విశ్వవిద్యాలయం, పరిసర ప్రాంతాల్లో చెలరేగిన హింస ఘటనలపై రెండు కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. జామియా నగర్ పోలీస్ స్టేషన్లో ఒకటి, న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది.
జామియా ఘటనపై దిల్లీ హైకోర్టులో పిటిషన్..
జామియా ఇస్లామియా వర్శిటీలోని విద్యార్థులపై ఆదివారం రాత్రి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరగా అందుకు నిరాకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పాటిల్ నేతృత్వంలోని ధర్మాసనం. గాయపడిన విద్యార్థులకు సరైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు.
ఇదీ చూడండి: లఖ్నవూ నద్వా కళాశాలలో విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు