హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందరమైన పర్వతాలలో.. ఓ మారుమూల గ్రామంలో ప్రసిద్ధ దుర్గామాత ఆలయం ఉంది. మండీ జిల్లాలోని కర్సోగ్‌లో సుమారు 1,404 మీటర్ల ఎత్తులో ఈ మందిరం కొలువై ఉంది. దేశంలో ఎన్నో దేవాలయాలున్నప్పటికీ ఈ గుడి మాత్రం భిన్నం. కారణమేంటంటే 'చిండీ మాత' ఆలయంగా పిలిచే ఈ గుడికి చీమలు పటాన్ని రూపొందించాయట.
అమ్మాయి రూపంలో...
ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహంతో సహా 'అష్ఠాభుజ' పేరుతో అమ్మవారు కొలువై ఉంటారు. ఆలయ ప్రాంగణ గోడలపై ఉన్న చిత్రాలు కనులవిందు చేస్తాయి. ఇక్కడ అమ్మవారిని అమ్మాయిగా అలంకరిస్తారు.
అప్పట్లో స్థానిక పూజారికి ఈ అమ్మవారే కలలో కనిపించి గుడిని నిర్మించాలని కోరిందట. దానికి చీమలదండు ఓ పటాన్ని గీశాయట. దాని ప్రకారమే ఈ గుడి నిర్మాణం జరిగిందని ఆ పూజారి కథనం.!
చంకరథ్లో...
'చిండీ మాత' ప్రతి మూడేళ్లకోసారి తాత్కాలికంగా గుడిని వదిలివెళ్లిపోతారని స్థానికులు నమ్ముతారు. ఈ కథను చంకరథ్లో నాటక రూపంలో ప్రదర్శన జరుపుతారు. సంతానం, ఆరోగ్యం కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక మొక్కులు చెల్లిస్తుంటారు.
ఇదీ చదవండి: 'ప్లాస్టిక్ భూతం' వద్దు.. 'జనపనార' ముద్దు!