ETV Bharat / business

మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు గుడ్‌ న్యూస్‌ - KYC రూల్స్​ ఛేంజ్​ - ఇకపై నో టెన్షన్​! - Mutual Fund KYC New Rules

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 5:10 PM IST

Mutual Fund KYC New Rules : స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ కోసం ఆధార్‌- పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని సడలించింది. ఇకపై ఆధార్‌, పాస్​పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ సహా అనుమతించిన ఇతర పత్రాలతోనూ కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ పొందొచ్చని సర్క్యులర్​లో పేర్కొంది.

Mutual Fund KYC New Rules
mutual funds (ETV Bharat)

Mutual Fund KYC New Rules : మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. కేవైసీ నిబంధనల్ని స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా' (సెబీ) మరింత సులభతరం చేసింది. కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ కోసం ఆధార్‌- పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని సడలించింది. ఈమేరకు సెబీ సర్క్యులర్​ను విడుదల చేసింది.

మోసాలకు చెక్​!
బ్యాంకులు, ఫండ్‌ హౌస్​లు, స్టాక్‌ బ్రోకర్లు పెట్టుబడి ప్రారంభించే ముందు గుర్తింపును ధ్రువీకరించే ప్రక్రియనే కేవైసీ అంటారు. పారదర్శక వాతావరణంలో మదుపరులు తమ పెట్టుబడులను నిర్వహించేందుకు వీలు కల్పించడం సహా, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించేందుకు కేవైసీ ప్రక్రియను చేపడతారు. కాగా, అంతకుముందు పాన్‌- ఆధార్‌ లింక్‌ చేయకపోతే కేవైసీ హోల్డ్​లో ఉండేది. అంటే తిరిగి పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఉండేది కాదు. ఈ కేవైసీ ప్రక్రియను 2024 మార్చి 31లోపు కచ్చితంగా పూర్తి చేయాలని 2023 అక్టోబర్‌లోనే సెబీ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మార్చి 31 నుంచి కొత్త పెట్టుబడులను అనుమతించమని స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా అనేక మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు తాత్కాలిక సస్పెన్షన్​కు గురయ్యాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్న 13 మిలియన్‌ ఖాతాలు ఇబ్బందుల్లో పడ్డాయి. మే 14న జారీ చేసిన సర్క్యులర్​లో సెబీ ఈ నిబంధనల్ని సడలించింది.

తప్పనిసరి కాదు!
ఇప్పటి వరకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటే తప్పనిసరిగా పాన్​ను ఆధార్​తో లింక్‌ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆధార్‌, పాస్​పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ వంటి ఇతర పత్రాలతోనూ కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ పొందొచ్చని సెబీ తెలిపింది. కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ పొందిన మదుపరులు ఇప్పటికే పెట్టుబడులు కలిగి ఉన్న ఫండ్‌ హౌస్​లతో మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేయగలరు. కానీ కేవైసీ వ్యాలిడేట్‌ స్టేటస్‌ పొందాలంటే మాత్రం పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయాలని పేర్కొంది. ఈ స్టేటస్‌ పొందిన పెట్టుబడిదారుల లావాదేవీలపై ఎటువంటి పరిమితులూ ఉండవు. కేవైసీ స్టేటస్‌ కోసం సీడీఎస్​ఎల్‌ వెబ్​సైట్​కు వెళ్లి కేవైసీ ఎంక్వైరీపై క్లిక్‌ చేసి స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు.

‘స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా? - What Is Streedhan

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ - రోజుకు రూ.50 పొదుపు చేస్తే చేతికి రూ.30లక్షలు! - Gram Suraksha Yojana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.