ఈవీఎంలకు కేంద్ర బలగాల బందోబస్తు: పోలీస్ కమిషనర్ - Tight Security At EVM Strong Rooms
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2024, 7:39 AM IST
PHD Ramakrishna on Security at EVM Strong Room : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంల్లో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.76 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల నుంచి పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించి భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. అధికారులు ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
Security at EVM Strong Room : స్ట్రాంగ్ రూం వద్ద ఫేస్ రికగ్నిషన్, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెడుతున్నామని పోలీసులు తెలిపారు. కేంద్ర బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నుంచి పాస్ తీసుకున్న అభ్యర్థిని మాత్రమే స్ట్రాంగ్ రూం వద్దకు అనుమతిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని నలుగురు కంటే ఎక్కువ తిరగకూడదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి.