ETV Bharat / politics

ఏపీలో గెలిచేదెవరో తెలుసా?- భారీ పోలింగ్​ వెనుక కారణాలేంటి? - AP ELECTION RESULT

Who will Win in AP : తరచి చూస్తే దాదాపు 42గంటల తర్వాత గానీ లెక్క తేలలేదు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్​ నమోదు కాగా, ఈ సారి అంతకుమించి 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత భారీ స్థాయిలో నమోదైన పోలింగ్​ ఎవరికి అనుకూలిస్తుంది! అనే ఆలోచనలు, అంచనాలు అందరిలోనూ మొదలయ్యాయి. "తగ్గేదేలే"! అంటూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణాలేంటి? పోలింగ్ ప్రారంభానికి ముందే బారులుదీరడం వెనుక ఆంతర్యమేంటి?

who_will_win_in_ap_election
who_will_win_in_ap_election (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 5:35 PM IST

Updated : May 15, 2024, 10:43 PM IST

Who will Win in AP : ఆంధ్రప్రదేశ్​ ఓటర్ల నాడి ఏంటి? తండోపతండాలుగా తరలివచ్చిన ఓటర్లు ఏ బటన్​ నొక్కారు? భారీగా నమోదైన పోలింగ్​ను ఎలా భావించాలి? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? విశాఖను రాజధాని చేస్తామన్నా ఉత్తరాంధ్రలోనూ అధికార పార్టీపై వ్యతిరేకతకు కారణాలేంటి? సర్వేలు ఏం చెప్తున్నాయి? ఏ అంశాలను పరిశీలించాయి? ఏఏ వర్గాల అభిప్రాయాలను సేకరించాయి? విజయానికి ప్రాతిపదిక ఏంటి? ఓటమిని ప్రభావితం చేసే కారణాలను ఎలా అంచనా వేయాలి? అధికార పక్షం ఉలిక్కిపడిందా? ప్రతిపక్షాల ధీమా ఏంటి? పదండి! పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati

2014, 2019 ఎన్నికల్లోనూ భారీ స్థాయిలో పోలింగ్​ నమోదైంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్సీపీని ఆదరించారు. భారీగా నమోదైన పోలింగ్ అధికార మార్పిడికి దారి తీసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేక పోయింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్​ ఇచ్చిన వాగ్దానాలు ప్రజల దృష్టిని మళ్లించాయి. ప్రధానంగా ఏటా జాబ్​ క్యాలెండర్, మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పంటకు మద్దతు ధర హామీలు అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి.

2014లో రాష్ట్ర విభజన అంశం, కాంగ్రెస్​పై పెరిగిన వ్యతిరేకత భారీ పోలింగ్​కు బీజం వేసింది. రాష్ట్ర పునర్నిర్మాణం ఐటీ విజనరీ చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు అధికారాన్ని అప్పగించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి రాజధాని నగరానికి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్​మోహన్​రెడ్డి ఇచ్చిన హామీలు వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి. కానీ, 2024 ఎన్నికలు వచ్చేనాటికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ విఫలమైంది. ప్రధాన హామీలను విస్మరించి పైపై మెరుగులు రుద్దే ప్రయత్నం చేసింది. బటన్​ నొక్కుతున్నామంటూ పథకాల పేరిట డబ్బు పంపిణీ తప్ప ఏ ఒక్క అడుగు ముందుకు పడలేదు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నగర నిర్మాణాలు పడకేశాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఊసేలేకపోగా, పాత ప్రాజెక్టుల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందించలేకపోయింది. విద్యుత్​ బిల్లులు, చెత్త పన్నులు, పెరిగిన ఆర్టీసీ చార్జీలు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించాయి.

ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter

విశాఖను రాష్ట్ర రాజధానిగా చేస్తామన్నా ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించిందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. విశాఖలో అధికార పార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించిపోయాయి. రిషికొండకు గుండు కొట్టడం, రియల్ దందాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణ, లులూ మాల్ తెలంగాణకు వెళ్లిపోవడం, ఐటీ కంపెనీల కార్యకలాపాలకు కేటాయించిన మిలినియం టవర్స్​ను గాలికొదిలేయడం తదితర పరిణామాలు అక్కడి ప్రజల్లో భయాందోళన కలిగించాయి. "ఉత్తరాంధ్రపై రాయలసీమ రెడ్ల పెత్తనమేంటి?" అని సాక్షాత్తూ అధికార పార్టీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పట్టింది.

దేశంలో రికార్డు నమోదు చేసిన ఏపీ ఓటర్లు- నాలుగో విడతలో అత్యధికంగా 81.86 శాతం పోలింగ్​ - MUKESH KUMAR MEENA ON ELECTIONS

వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతు ఉన్నా అవి ఓటు వేసే దాకా తీసుకెళ్లలేక పోయాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలు, స్థానిక నేతల దందాలు, ప్రతిపక్ష నేతలపై అరాచకాలు, అక్రమ కేసులు, యువతకు ఉపాధి కల్పించకపోవడం, పెరిగిన నిరుద్యోగం ప్రతిపక్షాలకు కలిసొచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ, పోలవరం కట్టిస్తామన్న మోదీ మాటలపై విశ్వాసం, ఇరు పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడంలో జనసేనాని పవన్​ కల్యాణ్ చొరవ కూటమి​పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి.

అటు రాయలసీమలో కూటమి తీవ్ర పోటీ ఇవ్వడంతో పాటు ఆశించిన స్థానాలు గెలుస్తుందని సర్వేలు చాటుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలోనూ హవా కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక నడుమ గుంటూరు, కృష్ణా, కోస్తా జిల్లాల్లో కూటమి విజయం ఏకపక్షమే అని సమాచారం.

రాష్ట్రంలో కూటమిదే అధికారం- మోదీ నామినేషన్​లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ - Modi nomination

Last Updated : May 15, 2024, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.