AP Elections 2024 : ఇంటింటికీ రాజకీయ పార్టీల నేతల రాక, ప్రచార కాక, సభల హోరు, ర్యాలీల జోరు దాదాపు రెండు నెలల ఎన్నికల ప్రచారం ఊళ్లను ముంచెత్తిన సునామీని తలపించింది. నేతల మాటల తూటాలు, పరస్పర విమర్శనాస్త్రాలు, ఆరోపణల బాణాలు, మండుటెండల్లో వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఐదేళ్లకోసారి వచ్చే రాజకీయ తుపాను ఈ సారి రాష్ట్రాన్ని బెంబేలెత్తించింది. పల్నాడు జిల్లాలో తీరం దాటిందా! అన్నట్లు ఆ జిల్లా వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలు పోలీసులకూ చుక్కలు చూపించాయి.
జన జాతరను తలపించిన ఎన్నికలు చలికాలపు సంక్రాంతి ఎండాకాలంలో వచ్చినట్టు, రంజాన్, క్రిస్మస్ పండుగలన్నీ ఒక్క ముహూర్తానికే వచ్చాయా?! అన్నట్లు తండోపతండాలుగా తరలి వచ్చిన ప్రజలు. హైదరాబాద్ ఆంధ్రాకు వలస వెళ్లిందా అనిపించేలా విజయవాడ దాకా బారులు దీరిన వాహనాలు.
అర్ధరాత్రి వరకు పోలింగ్, చీకట్లో ఓటింగ్... ఇప్పటికీ లెక్కలు తేల్చే పనిలో అధికార గణం. భారీగా ఖర్చు చేసిన నల్లధనం, పంచిన మద్యం, ఎరవేసిన తాయిలాలు, ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో? అంచనాల్లో రాజకీయ నేతలు. కోడి పందేలను మించిన బెట్టింగులు. కానీ, ఇది గుడివాడ కాదు గురూ! ఫలితం వచ్చాక చూడాలి మరి సత్తెనపల్లి శ్యాంబాబు నృత్యాలు!!
ఓటేసి హైదరాబాద్ బాట పట్టిన జనం -కిక్కిరిసిన మెట్రో, బస్సులు - Voters Returned To Hyderabad
ఎన్నికల పండుగ ముగిసింది. ఇక మిత్రులెవరో! శత్రువు లెవరో పదహారొద్దుల (జూన్ 4) పండగ నాటికి గానీ తేలదు. ఫలితం చూడాలనుకుంటే అప్పటి వరకూ ఆందోళన వద్దు. ఆయాస పడొద్దు. కాస్త విశ్రాంతినిస్తేనే కదా గుండె దడ తగ్గేది.
ఎవ్వరూ ఊరకే డబ్బులు పంచరు, మద్యం తాగించరు మరో ఐదేళ్ల వరకు! నీ జీవితం నీదే. నీ కుటుంబానికి నువ్వే దిక్కు. ఈ విషయం నువ్వు మర్చిపోయినా బిడ్డల ఆకలి నీకు గుర్తు చేస్తుంది. పండగ అయిపోయింది. ఇక పద పొట్టకూటి కోసం మళ్లీ మహానగరానికి.
నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu
ఓటింగ్ యంత్రాల విధ్వంసం, ఓటరన్నపై చెంపదెబ్బ, ప్రజాచైతన్యంపై పిడిగుద్దులు, పోలింగ్ కేంద్రాల్లో ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాలు ఈ సారి ఎన్నికల్లో పదనిసలు.
దేశ భవిష్యత్‌ని నిర్ణయించేందుకు మరో మూడు విడతల్లో ఎన్నికలు, రాష్ట్ర నాయకత్వ ఎన్నికపై నిక్షిప్తమైన తీర్పు.. ఏపీ ఊపిరి పీల్చుకో!
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - andhra pradesh elections 2024